భీమవరం : టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

Siva Kodati |  
Published : Sep 05, 2023, 09:13 PM IST
భీమవరం : టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ, ఉద్రిక్తత

సారాంశం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు పట్టణంలో ఫ్లెక్సీలు , బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీలను కట్టడంతో గొడవ జరిగింది.

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ నేతలు పట్టణంలో ఫ్లెక్సీలు , బ్యానర్లను ఏర్పాటు చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ నేతలు కూడా ఫ్లెక్సీలను కట్టడంతో గొడవ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే రాళ్ల దాడిలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం