ఏపీ బీజేపీలో కలకలం : సోము వీర్రాజుపై ధిక్కార స్వరం .. పలు చోట్ల నేతల రాజీనామాలు

By Siva KodatiFirst Published Jan 5, 2023, 2:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో సోము వీర్రాజుపై అసంతృప్తి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే దీనిపై వ్యాఖ్యలు చేస్తుండగా.. తాజాగా పలు ప్రాంతాల్లో నేతలు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 

ఏపీ బీజేపీలో కల్లోలం చోటు చేసుకుంది. జిల్లాల అధ్యక్షుల మార్పు వ్యవహారంపై నిరసనలు భగ్గుమంటున్నాయి. సోము వీర్రాజు నిర్ణయానికి నిరసనగా పలువురు బీజేపీ నేతలు రాజీనామా చేశారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆరు జిల్లాల బీజేపీ అధ్యక్షులను మార్చారు. వీరిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. ఇదంతా ఏకపక్ష నిర్ణయమని పలువురు బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

అనకాపల్లి, శ్రీకుళం జిల్లాలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజీనామా చేశారు. కృష్ణా జిల్లాలోని వివిధ విభాగాల పదవులకు పలువురు రాజీనామాలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాజీనామాలు వుంటాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాష్ట్ర బీజేపీ స్పందించింది. పార్టీ విధానాలను అనుసరించే పదవుల్లో మార్పులు చేర్పులు చేశామని చెబుతోంది. జిల్లా అధ్యక్షులుగా వున్న వాళ్లకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తీసుకోవడం ప్రమోషన్ అని అంటోంది. 

అటు సోము వీర్రాజు టార్గెట్‌గా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు  చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ల కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ను, తెలంగాణ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను వీక్ చేసే కుట్ర జరుగుతుందోని అన్నారు. జగన్, కేసీఆర్‌ ఇద్దరూ కలిసే ఈ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ALso REad: ఏపీలో బీఆర్ఎస్ కు ప్రజామోదం ఉండదు: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరూ బతికి ఉండకూడదని జగన్ ఆలోచన అని విమర్శించారు. జగన్‌ది పాలన కాదని.. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మండిపడ్డారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏ రాజకీయ నేతను బతకనీయరని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజకీయ పక్షాలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఏపీలోని కాపు నేతలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని అన్నారు. పవన్‌కు తామంతా అండగా ఉంటామని చెప్పారు. 

Also REad: పవన్‌ను వీక్ చేసేందుకు జగన్, కేసీఆర్‌ల కుట్ర.. వియ్యంకుడు బీఆర్ఎస్‌లో చేరడంపై వీర్రాజు ఏమంటారు?: కన్నా సంచలనం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజుపై కూడా మరోసారి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన కన్నా లక్ష్మీనారాయణ.. తాను నియమించినవారినే సోము వీర్రాజు తొలగిస్తున్నారని అన్నారు. అధ్యక్షుల మార్పుపై తనతో చర్చించలేదని తెలిపారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేలో చేర్పించానని.. ఇప్పుడు వాళ్లంతా పార్టీని వీడుతున్నారని అన్నారు. తన వియ్యంకుడు బీఆర్‌ఎస్‌లో చేడంపై ఏమంటారో సోము వీర్రాజునే అడగాలని అన్నారు. 
 

click me!