దారుణం.. కన్నకూతురిపై తండ్రి లైంగికదాడి

Published : Sep 12, 2018, 03:23 PM ISTUpdated : Sep 19, 2018, 09:24 AM IST
దారుణం.. కన్నకూతురిపై తండ్రి లైంగికదాడి

సారాంశం

ఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు. తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. 

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే... కామాంధుడయ్యాడు. చిన్నపిల్ల అన్న కనికరం లేకుండా.. కన్నకూతురిపై లైంగికంగా దాడి చేశాడు. చాక్లెట్ కొనిపెడతానని ఆశపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దారుణం తెలుసుకున్న తల్లి.. చూస్తూ ఉరుకోలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ సంఘట గుంటూరు జిల్లా తాడికొండలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తాడికొండ గ్రామానికి చెందిన షేక్‌ నాగుల్‌ బీ అనే మహిళకు 7 సంవత్సరాల క్రితం గుంటూరు లక్ష్మీనారాయణపురానికి చెందిన షేక్‌ రహ్మల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. అతనికి అప్పటికే ఒక వివాహం జరిగి భార్య మరణించగా, ఇది రెండో వివాహం. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ సంతానం. తొలినుంచి భర్త సైకో మనస్తత్వంతో ఇబ్బందులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన నాగుల్‌బీ ఠాణాలో కేసు పెట్టి భర్తకు దూరంగా ఉంటోంది.

పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల భార్యతో కాపురం చేసేందుకు వచ్చిన రహ్మల్‌ రెండు నెలలుగా తాడికొండలోనే ఉంటున్నాడు. ఈ నెల మూడో తేదీన పాఠశాల నుంచి వచ్చిన పెద్ద కుమార్తె (7) ను తినుబండారం కొనిపిస్తానంటూ బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే రోజు గుంటూరుకు వెళ్లిపోయిన భర్త ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు పాఠశాల నుంచి వచ్చిన కుమార్తె కడుపు నొప్పి అంటూ బాధపడుతుంటే వేడి చేసి ఉంటుందని భావించిన తల్లి అంతగా పట్టించుకోలేదు.

 తరచూ నడుము నొప్పి, కడుపు నొప్పి అంటుండటంతో 10న గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లిన తల్లికి వైద్యులు బాలికపై లైంగిక దాడికి గురైందని చెప్పడంతో విస్తుపోయింది. కుమార్తెను ఆరా తీయగా.. తండ్రే తనను బయటకు తీసుకెళ్లి ముద్దులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడని తెలపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తాడికొండ ఎస్‌ఐ సీహెచ్‌ రాజశేఖర్‌ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Vemireddy Prashanthi Reddy Fires On Gudiwada Amarnath | Asianet News Telugu
School Holidays 2026-27 : ఈ అకడమిక్ ఇయర్ లో 87 రోజులు సెలవులే.. తెలుగు స్టూడెంట్స్ కి ఏ నెలలో ఎన్ని సెలవులు?