నాలుగేళ్ల కూతురిపై కన్నతండ్రే.. దారుణం

Published : Oct 10, 2018, 12:16 PM IST
నాలుగేళ్ల కూతురిపై కన్నతండ్రే.. దారుణం

సారాంశం

భర్త వక్రబుద్ధి గమనించింన భార్య.. పిల్లలను తీసుకొని అతనికి దూరంగా ఉంటుంది. రెండు రోజుల క్రితం పిల్లలపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. భార్య వద్దకు వచ్చిన కోటి నాగేశ్వరరావు.. నాలుగేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు.

కన్నకూతురు అని కూడా చూడకుండా.. నాలుగేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో చోటుచేసుకుంది. అవనిగడ్డ మండలం మోదుమూడి గ్రామానికి చెందిన కోటినాగేశ్వరరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే.. భర్త వక్రబుద్ధి గమనించింన భార్య.. పిల్లలను తీసుకొని అతనికి దూరంగా ఉంటుంది. రెండు రోజుల క్రితం పిల్లలపై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. భార్య వద్దకు వచ్చిన కోటి నాగేశ్వరరావు.. నాలుగేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు.

కూతురనే కనికరం లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించాడు. గమనించిన భార్య.. వెంటనే కూతురిని భర్త నుంచి రక్షించుకోగలిగింది. వెంటనే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే