కాపు కోటాకి వైఎస్ జగన్ ఎసరు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

By Sreeharsha GopaganiFirst Published Jun 27, 2020, 8:39 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాపు నేస్తంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాపు రేజర్వేషన్లను పక్కదోవ పట్టియ్యడానికే జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలను ప్రారంభిస్తున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కాపు నేస్తంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాపు రేజర్వేషన్లను పక్కదోవ పట్టియ్యడానికే జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలను ప్రారంభిస్తున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 

13 నెలల కాలంలోలె కాపుల కోసం 4,770 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం.... ద్వారా కాపులను రిజర్వేషన్ మాట ఎత్తకుండా చేయాలనీ సంకల్పించారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కాపులకు వెచ్చించామని చెప్పుకుంటున్న నిధులు రాష్ట్రంలోని ఇతర కులాలతో కలిపి ఇచ్చారా, లేదా కాపులకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చారా అని పవబం కళ్యాణ్ ప్రశ్నించారు. 

గాలికి పోయే పేలాల పిండంతా కృష్ణార్పణం అన్నట్టుగా సీఎం జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.... , ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా... అది కాపులకు ప్రత్యేకం అని ప్రభుత్వం లెక్కలు చెప్పుకుంటుందని ఆయన ఎద్దేవా చేసారు. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పై అనేక అనుమానాలున్నాయని ఆయన నిన్న విడుదల చేసిన పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. కాపు నేస్తం పథకం కింద 2.35 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేయడంపై అనేక అనుమానాలున్నాయని ఆయన అన్నారు. 

కాపు కారొపోరాటిన్ తోపాటుగా మిగిలిన కులాల కార్పొరేషన్లకు ఎన్నెన్ని నిధులు ఏయే బడ్జెట్లో కేటాయించారని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలనీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఒకో కులానికి ఇంత సహాయం చేసాము, అంత సహాయం చేసాము అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటుంటే... అధికులలా మధ్య చిచ్చు పెట్టేదిలా ఉందని ఆయన అన్నారు. ఎక్కువ నిధులు ఒకే కులానికి దక్కుతున్నాయని సీఎం చెప్పడం అంత మంచిది కాదని, ఇది కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి వైషమ్యాలను పెంచుతుందని పవన్ అన్నారు. 

కాపు కులస్తులకు రిజర్వేషన్ కోసం పుట్టిందే కాపు కార్పొరేషన్ అని, అలాంటి కాపు రేజర్వేషన్ల గురించి వైసీపీ లోని కాపు నాయకులంతా మరిచిపోయారని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. 

రిఫెసెర్వేషన్ కోసం పోరాడుతున్న కాపుల దృష్టి మరల్చడానికి గత టీడీపీ ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తే.... ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధిక తెలివితేటలను ప్రదర్శిస్తోందని అన్నారు పవన్ కళ్యాణ్. 

ఏ పథకం కింద లబ్ది చేకూరినా అది కాపులకు ప్రత్యేకం అని అంటున్నారని, నవరత్నాలను కూడా ఈ లెక్కల్లో కలిపేసేయ్ లెక్కలనుఈ అమాంతం పెంచేశారని పవన్ కళ్యాణ్ అన్నారు. 

గత ప్రభుత్వం ప్రతియేటా కాపు కార్పొరేషన్ కి 1000 కోట్లు ఇస్తామని చెప్పిందని, ఈ ప్రభుత్వం ఏకంగా 2వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారని... ఇంతకు వీరిరువురు ఎంతిచ్చారో లెక్క తేలాలి అన్నారు. అడిగిన వారికి మాత్రం కాకి లెక్కలు చెబితున్నార్నాటు ఆయన ప్రభుత్వంపై మండి పడ్డారు. 

click me!