కిడ్నాప్ కాదు...తండ్రే చంపేశాడు: కొడుకు గొంతుకోసి కొండల్లో పడేశాడు

sivanagaprasad kodati |  
Published : Dec 03, 2018, 08:01 AM IST
కిడ్నాప్ కాదు...తండ్రే చంపేశాడు: కొడుకు గొంతుకోసి కొండల్లో పడేశాడు

సారాంశం

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అదృశ్యమైన మూడేళ్ల బాలుడి కథ విషాదంగా ముగిసింది. కన్నతండ్రే చిన్నారని అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అదృశ్యమైన మూడేళ్ల బాలుడి కథ విషాదంగా ముగిసింది. కన్నతండ్రే చిన్నారని అత్యంత దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళలితే ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన షాహుల్ అనే చిన్నారి కనిపించడం లేదంటూ తల్లి సల్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన భర్తతో కొద్దిరోజులుగా మనస్పర్థలు ఉన్నాయని అతనే తన బిడ్డను ఏమైనా చేసి వుంటాడని అనుమానం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి తండ్రి ఖాదర్‌వలిని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు ప్రశ్నించారు.

అయితే తాను బాబుకి తినుబండారాలు కొనిపెట్టి తిరిగి ఇంటి వద్దే వదిలిపెట్టానని చెప్పాడు. భర్త దగ్గరి నుంచి సరైన సమాచారం రాకపోవడంతో సల్మా కంగారుపడింది... కొడుకును ఖాదర్‌వలినే చంపేశాడని సరిగా విచారించాలని పోలీసులను వేడుకుంది..

దీంతో ఖాకీలు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తనే షాహుల్‌ను ఎత్తుకెళ్లి గొంతుకోశానని అనంతరం కొండల్లో పడేశానని చెప్పాడు. ఈ వార్తతో సల్మా కుప్పకూలిపోయింది. తన కొడుకును హత్య చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu