కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ కి తీసుకువెళ్తుండగా ప్రమాదం

Published : Apr 29, 2019, 11:54 AM IST
కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ కి  తీసుకువెళ్తుండగా ప్రమాదం

సారాంశం

కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ లో చేర్పించేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగి.. తండ్రి కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

కుమార్తెను ఐఏఎస్ కోచింగ్ లో చేర్పించేందుకు వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగి.. తండ్రి కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపురం జిల్లా చింతామణికి చెందిన కంట్రాక్టర్ మంజునాథ్ అయ్యర్(60), కుమార్తె కావ్యను  హైదరాబాద్ లో ఓ కోచింగ్ సెంటర్ లో చేర్పించాలనుకున్నారు. 

ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున కుమార్తెతో కలిసి కారులో బయలుదేరారు. అనంతపురం దాటాక జాతీయ రహదారి 44పై పామిడి సమీపాన గల పంజాబిడాబా వద్ద కారు ముందు టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపు తప్పి అటువైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొంది.
 
ప్రమాదంలో మంజునాథ్‌ అయ్యర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. కావ్య (24) గాయపడగా పనిమనిషి వినయ్‌కుమార్‌కు చేయి విరిగింది. డ్రైవర్‌ ఎల్లప్ప స్వల్పగాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పామిడి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పామిడి ఆసుపత్రికి తరలించారు. 

మంజునాథ్‌ అయ్యర్‌ మృతదేహాన్ని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు. తెల్లవారు బయల్దేరినవారు అంతలోనే ప్రమాదానికి గురై మృత్యువాతపడ్డారనే సమాచారంతో చింతామణిలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman: మిమ్మల్ని ఏమైనా అంటే..! కోపాలు తాపాలు... చేసేవి పాపాలు | Asianet Telugu
Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు