తొమ్మిదినెలల చిన్నారి గొంతులో చేపపిల్ల వేసిన కసాయి తండ్రి.. ఊపిరాడక....

Published : Jul 12, 2021, 03:15 PM IST
తొమ్మిదినెలల చిన్నారి గొంతులో చేపపిల్ల వేసిన కసాయి తండ్రి.. ఊపిరాడక....

సారాంశం

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య మీద అనుమానంతో తొమ్మిది నెలల పసికందు గొంతులో చేపపిల్లను వేశాడో కసాయి తండ్రి. దీంతో ఊపిరి ఆడక ఆ బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం చెరుకువాడలో కన్నకొడుకును చంపేశాడో తండ్రి. తొమ్మిది నెలల చిన్నారి గొంతులో చేపపిల్ల వేశాడో కసాయి. గొంతులో చేప ఇరుక్కోవడంతో ఊపిరి ఆడక బాలుడు చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. 

తొమ్మిది నెలల చిన్నారి గొంతులో తండ్రి నారాయణ చేపపిల్ల ఎందుకు వేశాడన్నది మిస్టరీగా మారింది. అయితే బార్యమీద కోసంతోనే ఇలా చేశాడని స్తానికులు ఆరోపిస్తున్నారు. 

భార్య ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటగట్టేవాడని, నిత్యం అనుమానిస్తూ టార్చర్ పెట్టే వాడంటూ ఈ క్రమంలోనే అనుమానం పెనుభూతమై ఆ కోపాన్ని చిన్నారిమీద తీర్చుకున్నాడని మండిపడుతున్నారు.

స్థానికులు ఇంతగా ఆరోపణలు చేస్తున్నా.. నారాయణ మాత్రం తనకేం తెలియనట్టుగానే చూస్తూ ఉండిపోయాడు. బిడ్డను చంపిన పశ్చాత్తాపం ఏ మాత్రం అతనిలో కనిపించలేదు. అభం శుభం తెలియని చిన్నారి ఉసురుతీసిన నారాయణను కఠినంగా శిక్షించాలని చెరుకువాడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

తల్లి ఒడిలో ఆడుకుంటున్న తొమ్మిది నెలల బాలుడి గొంతులో గొరక చేపను వేశాడు తండ్రి నారాయణ. ఇది గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే బాలుడు చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు.

భార్య సుధారాణి మీద భర్త నారాయణకు ఉన్న అనుమానమే కొడుకు మృతికి కారణంగా మారింది. కొడుకు నారాయణకంటే కొంచెం ఎరుపుగా పుట్టడంతో ఈ అనుమానం మరింత బలపడింది. చివరికి చిన్నారి ఉసురు తీసింది.

అయితే చేపపిల్ల ఇంట్లోకి ఎలా వచ్చింది? ముందుగా చంపే ఉద్దేశ్యంతోనే నారాయణ తీసుకువచ్చాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu