కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

Published : May 15, 2023, 06:55 AM ISTUpdated : May 15, 2023, 07:05 AM IST
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఏడుగురు దుర్మరణం

సారాంశం

ఏపీలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుఫాన్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. ఈ ఘటన కొండాపురం మండలంలో జరిగింది. 

కడప: ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. తిరుమల నుంచి తాడిపత్రి వెళ్తున్న తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కడప జిల్లా కొండాపురం మండలం చిత్రావతి వంతెన సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నారు.

మరణించినవారు తాడిపత్రికి చెందినవారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?