దారుణం : దొంగ అనుకుని భక్తుడ్ని చెట్టుకి కట్టేసి, కొట్టి చంపారు..

By AN TeluguFirst Published Mar 1, 2021, 9:43 AM IST
Highlights

దొంగ అనుకుని అపరభక్తుడిని కొట్టి చంపిన దారుణ ఘటన కర్నూలులో జరిగింది. పొలాల్లోకి బహిర్భూమికి వచ్చిన అతన్ని రైతులు దొంగ అనుకుని దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దొంగ అనుకుని అపరభక్తుడిని కొట్టి చంపిన దారుణ ఘటన కర్నూలులో జరిగింది. పొలాల్లోకి బహిర్భూమికి వచ్చిన అతన్ని రైతులు దొంగ అనుకుని దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు అసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే ఆదోని మండలం నాగలాపురానిక చెందిన ఢనాపురం నరసప్ప (55) పరమ భక్తుడు. గురుబోధ కూడా తీసుకున్నాడు. శుక్రవారం కోసిగి మండల కేందరంలో సిద్ధారుడ స్వామి 5వ ఆరాధనోత్సవాలకు తన గ్రామనికే చెంది లింగన్నతో కలిసి వెళ్లాడు. ఇద్దరూ శనివారం మధ్యాహ్నం వరకు ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. 

ఆ తరువాత గుపుంలో ఇద్దరూ విడిపోయారు. లింగన్న సాయంత్రం 5 గంటలకు గ్రామానికి తిరిగొచ్చి నరసప్ప కనిపించకపోవడంతో ఒక్కడినే వచ్చానని నరసప్ప భార్య జయలక్ష్మికి చెప్పాడు. నరసప్ప శనివారం రాత్రంతా సిద్ధారుడ ఆశ్రమంలో ఉండిపోయాడు.

ఆదివారం తెల్లవారు జామున పక్కనే ఉన్న పొలల్లోకి బహిర్భూమికి వెళ్లాడు. చుట్టుపక్కల పొలాల్లో పడుకున్న రైతులు అతడ్ని చూసి దొంగ అనుకున్నారు. గట్టిగా కేకలు వేస్తూ నరసప్ప మీద దాడి చేశారు. అప్పటికీ నరసప్ప తాను దొంగను కాదని చెబుతున్నా.. పొలాల్లో ఈడ్చుకుంటూ వెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు. 

ఆ తర్వాత మరికొందరు చేసి తీవ్రంగా గాయపడిన నరసప్పను స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత ఆదోని ఏరియా ఆసుపత్రికిి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. నరసప్ప మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. 

నరసప్ప మృతదేహాన్ని చూసి గుండెపగిలేలా ఏడ్చారు. నరసప్ప అపరభక్తుడని, ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా కాలి నడకన వెళ్లి తిరిగి వస్తాడని వారు తెలిపారు. శ్రీశైలానికి నడిచి వెళ్లే భక్తులకు గరామ శివారులో అల్పాహారం, పాలు అందిస్తూ సేవ చేసేవాడని తెలిపారు. 

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని భార్య జయలక్ష్మి ఫిర్యాదు మేరకు.. నరసప్ప మీద దాడిచేసిన కపటి ఈరన్న, గోవిందు, కిందుగేరి ఈరన్నతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని సీఐ ఈశ్వరయ్య, ఎస్ ఐ ధనుంజయ తెలిపారు. 

కోసిగి సమీపంలోని పొలాల్లో కోతకు వచ్చిన పంటలు, కోసి సిద్ధం చేసిన ధాన్యాన్ని దొంగలు ఎత్తుకెల్తున్నారని రైతులు చెబుతున్నారు. ఈ ఘటనలమీద పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు కట్టడం లేదని ఆరోపిస్తున్నారు. కేసు పొలంలోకి వచ్చిన భక్తుడిని దొంగ అనుకుని దాడి చేయడానికి పోలీసుల తీరే పరోక్ష కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. 

click me!