పొలం డాక్యుమెంట్లు కోసం బ్యాంక్‌లోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం, ట్విస్ట్ ఏంటంటే..?

Siva Kodati |  
Published : Jul 17, 2021, 03:27 PM IST
పొలం డాక్యుమెంట్లు కోసం బ్యాంక్‌లోనే రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం, ట్విస్ట్ ఏంటంటే..?

సారాంశం

బాకీ చెల్లించినా బ్యాంక్ అధికారులు పొలం డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని రైతు తన కుటుంబంతో సహా ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే పొలం డాక్యుమెంట్లు మిస్సయ్యాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు

కర్నూలు జిల్లాలో రైతు కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మంత్రాలయం స్టేట్‌బ్యాంక్‌లో నాగేంద్ర అనే రైతు కుటుంబసభ్యులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. లక్షా 30 వేల రూపాయల నగదు చెల్లించినా బ్యాంక్ అధికారులు పొలం డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే పొలం డాక్యుమెంట్లు మిస్సయ్యాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?