జగన్.. ప్రజల రక్తం పీలుస్తున్నారు.. లోకేష్

By telugu news teamFirst Published Jul 17, 2021, 1:45 PM IST
Highlights

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ఆయన ప్రశ్నించారు. 

రక్తం పీల్చే జలగ కన్నా దారుణంగా.. సీఎం జగన్ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్  ఆరోపించారు. ట్విట్టర్ లో లోకేష్.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయన్నారు. ఇండియన్ పెట్రోల్ లీగ్‌లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. 31 శాతం వ్యాట్+లీటర్‌కు రూ.4 అదనపు వ్యాట్+లీటర్‌కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్‌కు 30 రూపాయిలు చేరిందన్నారు. 

 

రక్తం పీల్చే జలగకన్నా దారుణంగా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు .ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయి.ఇండియన్ పెట్రోల్ లీగ్ లో రికార్డుల మోత మోగిస్తూ పెట్రోల్ ధరను రూ.108,డీజిల్ ధరను రూ.100 చేసి బాదుడు రెడ్డి అనే పేరుని సార్ధకం చేసుకున్నారు(1/4) pic.twitter.com/4zwj2zcxPI

— Lokesh Nara (@naralokesh)

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల పెట్రోల్ బంకుల్లో ఏపీ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డులు పెట్టారంటే తమ దోపిడీ ఏ రేంజ్‌లో  ఉందో అర్ధమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షంలో అన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాలని లోకేష్ డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు.
 

click me!