బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు

Published : Jul 17, 2021, 02:40 PM IST
బచ్చుల అర్జునుడిని పరామర్శించిన చంద్రబాబు

సారాంశం

శ్రీబచ్చుల అర్జునుడుని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అర్జునుడు ఆరోగ్య వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గన్నవరం నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ, శ్రీబచ్చుల అర్జునుడుని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. అర్జునుడు ఆరోగ్య వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ఆయనకు తెలిపారు. అర్జునుడు ని పరామర్శించిన వారిలో చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ  కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టేం రఘురామ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమ, బోడె ప్రసాద్, తంగిరాల సౌమ్య, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామ చిన్నబాబు, టీడీపీ నాయకులు దేవినేని చందు,  తదితరులు ఉన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?