రైతు మృతి: కొండవీడుకు టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు..హైటెన్షన్

By Siva KodatiFirst Published 20, Feb 2019, 8:47 AM IST
Highlights

గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్య మృతి రాజకీయ రంగు పులుముకుంది. రైతు మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోటయ్య మృతి విషయంలో నిజనిర్థారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి.. కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడుదల రజనీ, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉంటారు.

మరో వైపు జనసేన కూడా కొండవీడులో పర్యటించనుంది. మరోవైపు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం అక్కడకు రానున్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలు ఒకేసారి కొండవీడుకు రానుండటంతో అక్కడ హైటెన్షన్ నెలకొంది.. దీంతో ముందు జాగ్రత్త చర్యగా భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. 
 
Last Updated 20, Feb 2019, 8:47 AM IST