అక్రమ సంబంధానికి ఒప్పుకోవడం లేదని... వివాహిత కూతురి హత్య

By Siva KodatiFirst Published 20, Feb 2019, 8:18 AM IST
Highlights

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదనే కక్షతో వివాహిత కూతురిని దారుణంగా చంపాడో కామాంధుడు. వివరాల్లోకి వెళ్లితే జగ్గయ్యపేట మండలం గుమ్మడిదర్రుకు చెందిన అనే సైదులు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ధనలక్ష్మీ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధానికి ఒప్పుకోవడం లేదనే కక్షతో వివాహిత కూతురిని దారుణంగా చంపాడో కామాంధుడు. వివరాల్లోకి వెళ్లితే జగ్గయ్యపేట మండలం గుమ్మడిదర్రుకు చెందిన అనే సైదులు అనే వ్యక్తి స్థానికంగా ఉన్న ధనలక్ష్మీ అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ధనలక్ష్మీ.. సైదుల్ని దూరం పెట్టింది. ఈ క్రమంలో సైదులు మరోసారి ఆమె వెంట పడటం మొదలుపెట్టాడు. తనతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలంటూ ఒత్తిడి తెచ్చారు.

దీనికి ధనలక్ష్మీ అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ కుమార్తె మల్లీశ్వరిని ఇవాళ ఉదయం తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలతో స్పృహా తప్పిన ఆమెను ధనలక్ష్మీ స్థానికుల సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా..ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ధనలక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సైదుల కోసం గాలిస్తున్నారు. 
 

Last Updated 20, Feb 2019, 8:18 AM IST