దారుణం : తల్లిదండ్రులను గుడి దగ్గర వదిలి వెళ్లిపోయిన కొడుకు.. అక్కున చేర్చుకున్న స్థానికులు

Siva Kodati |  
Published : Apr 23, 2022, 10:37 PM ISTUpdated : Apr 23, 2022, 10:38 PM IST
దారుణం : తల్లిదండ్రులను గుడి దగ్గర వదిలి వెళ్లిపోయిన కొడుకు.. అక్కున చేర్చుకున్న స్థానికులు

సారాంశం

నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో వృద్ద దంపతులను గుడి ఎదుట విడిచిపెట్టి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు. స్థానికులు వారిని అక్కున చేర్చుకుని పోలీసులకు సమాచారం అందించారు. 

కని పెంచి పోషించి పెద్దవాళ్లను చేసిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా వుండాల్సింది పోయి.. కొందరు పుత్రరత్నాలు పెద్దవాళ్లను రోడ్డు పాలు చేస్తున్నారు. వృద్ధులుగా మారిన దంపతుల అలనా పాలనా చూసుకోవాల్సిన కుటుంబ సభ్యులే వారికి శాపంగా మారుతుండటం కలచివేస్తోంది. వృద్ధులను అక్కున చేర్చుకోవాల్సిన కుటుంబసభ్యులే వారిని గుడి వద్ద దిక్కులేని వాళ్లలాగా వదిలిపెట్టి పోతున్నారు. తల్లిదండ్రుల నుంచి బలవంతంగా ఆస్తులను లాక్కొని వారిని రోడ్డున పడేస్తున్నారు. తాజాగా నరసరావుపేట మండలం ఇసప్పాలెంలో అమానుష చోటు చేసుకుంది. వృద్ధ దంపతులను గుడి ఎదుట సామాన్లతో సహా విడిచి వెళ్లారు కుటుంబ సభ్యులు. అయితే వీరిని గమనించిన స్థానికులు వారిని అక్కున చేర్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. బద్దూరి వెంకట సుబ్బారెడ్డి (74 ), సీతారావమ్మ (70) దంపతులు. వీరిది చిలకలూరిపేటగా చెబుతున్నారు. ఇటీవల చిలకలూరిపేటలో ఉన్న తమ ఇంటిని 30 లక్షలకు కొడుకు పేరిరెడ్డి అమ్మేసి తమను ఇక్కడ వదిలిపెట్టేశాడని వారు వాపోతున్నారు. సమాచారం అందుకున్న రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వృద్ధ దంపతులను అనాథ శరణాలయానికి తరలించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!