డిజిపి గౌతమ్ సవాంగ్ ను వదలని సైబర్ నేరగాళ్లు

By Arun Kumar PFirst Published May 31, 2021, 10:10 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ డిజిపి అధికారిక అకౌంట్ గా పేర్కొంటూ నకిలీ ట్విట్టర్ ను క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ పేరిటే ట్విట్టర్లో ఓ నకిలీ అకౌంట్ ను ప్రారంభించారు. ''డిజిపి ఆంధ్ర ప్రదేశ్'' పేరిట ఖాతా తెరిచిన నేరగాళ్లు సవాంగ్ ఫోటోను డిపిగా పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్ డిజిపి అధికారిక అకౌంట్ అని పేర్కొంటూ వరుసగా కొన్ని ట్వీట్లు చేశారు. 

ఇలా డిజిపి పేరిట వున్న ఈ నకిలీ అకౌంట్ ను పలువురు పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఫాలో అయ్యారు. అయితే అందులోని ట్వీట్లు అనుమానాస్పదంగా వుండటంతో సైబర్ టీంకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఇది నకిలీ అకౌంట్ గా గుర్తించింది. వెంటనే డిజిపి కార్యాలయానికి ఈ విషయాన్ని తెలపగా వారు ట్విట్టర్ కార్యాలయానికి ఫిర్యాదు చేసి సదరు నకిలీ అకౌంట్ ను తొలగింపజేశారు. 

ఏపి డిజిపి పేరిట నకిలీ అకౌంట్ తెరిచిన నేరగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. పోలీసులను టార్గెగ్ గా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్ల ఆటకట్టిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. 

click me!