విద్యార్ధులే టార్గెట్: బెజవాడలో నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్

Published : Oct 30, 2020, 01:58 PM IST
విద్యార్ధులే టార్గెట్: బెజవాడలో నకిలీ పోలీస్ ముఠా అరెస్ట్

సారాంశం

విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  

విజయవాడ: విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీస్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

గంజాయి సేవించే విద్యార్ధులను లక్ష్యంగా చేసుకొని విద్యార్థులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకొని డబ్బులు వసూలు చేస్తోంది. బెంగుళూరుకు చెందిన  విద్యార్ధి ఫిర్యాదుతో ఈ ముఠా గుట్టు బయటకు వచ్చింది.

గంజాయి కావాలనుకొనే విద్యార్ధులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తి నుండి సమాచారం తీసుకొన్న ఈ ముఠా విద్యార్ధుల నుండి డబ్బులు వసూలు చేస్తుంది. పోలీసుల  వేషంలో వచ్చి విద్యార్ధుల నుండి డబ్బులు లాగుతున్నారు. సుమారు రూ. 3 లక్షలు డిమాండ్ చేసి  రూ. 50 వేలకు ఒప్పందం కుదుర్చుకొంటున్నారు.

ఈ ముఠాలో ముగ్గురు కీలక సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదీప్, లతీఫ్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైనవారిలో  ఏఆర్ సబ్ ఇన్స్ పెక్టర్ కొడుకు కూడ ఉన్నాడని పోలీసులు చెప్పారు.దుర్గుగుడి పాలకమండలిలో కీలక సభ్యుడి బంధువు కూడ ఉన్నాడని పోలీసులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం