
అనంతపురం జిల్లా : Anantapur District శెట్టూరు మండలంలో జాయింట్ కలెక్టర్ పేరిట ఓ woman బుధవారం హల్ చల్ చేసింది. చింతర్లపల్లి, ములకలేడు, తిప్పనపల్లి సచివాలయాలను తనిఖీ చేసింది. తన పేరు సింధూరి జంపాల అని, JC of Secretariatsగా బాధ్యతలు చేపట్టాను అంటూ సిబ్బంది హాజరు పట్టిక బయోమెట్రిక్ పై ఆరా తీసింది. ఆ తర్వాత శెట్టూరు పీహెచ్ సీకి వెళ్ళింది. వైద్యుడు కుర్చీలో కూర్చున్న.. సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి విధులకు వస్తున్నది, మందుల నిల్వ వివరాలు అడిగింది. సచివాలయ సిబ్బంది ఈ విషయాన్ని తహసిల్దారు శంకరయ్య, ఎంపీడీవో వెంకట నాయుడు, ఎస్సై యువరాజుకు చేరవేశారు. వారందరూ పీహెచ్ సీకి చేరుకుని ఆమెను ప్రశ్నించారు.
జేసీ హోదాతోనే తనిఖీ చేస్తున్నాం అని, ఎక్కడైనా విచారించుకోండని చెప్పడంతో తహసిల్దార్ కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఆ పేరుతో ఎవరూ జాయిన్ కాలేదని చెప్పడంతో నిర్ధారించుకుని కలెక్టరేట్ కు తీసుకువెళ్లారు. అక్కడ జేసీ కేతన్ గార్గ్ ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ తరువాత శెట్టూరుకు తీసుకువచ్చి కేసు నమోదు చేశారు. ఆమె వెంట శెట్టూరు మండలం ములకలేడు ఆరోగ్య ఉపకేంద్రాల్లో పనిచేసే హెల్త్ అసిస్టెంట్ లక్షణ్ ఉన్నారు. ఎస్సై మాట్లాడుతూ సింధూరి సొంతూరు శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం అని, బీఎస్సీ కంప్యూటర్ చదివిందని తెలిపారు. గతంలో జిల్లాకేంద్రంలో పదో తరగతి స్క్వాడ్ గా, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ వైద్యుడిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది అని, రెండు ప్రైవేటు పాఠశాలలు, బత్తలపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిందని అన్నారు.
ఇదిలా ఉండగా, పదో తరగతి చదివిన ఓ వ్యక్తి ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తిన ఘటన గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బయటపడింది. ఈ నకిలీ డాక్టర్ ఉదంతంతో పోలీసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికేట్‌తో ఓ వ్యక్తి డాక్టర్ అవతారం ఎత్తాడు. అతని పేరు ముజిబ్. ఇక ఇతని గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.
దీంతో సదరు ఆసుపత్రిపై పోలీసులు దాడి చేసి ముజిబ్‌ను, ఆసుపత్రి నిర్వాహకుడు షోహబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముజిబ్‌కు నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందెవరనే దానిపై టాస్క్‌ఫోర్స్ ఆరా తీస్తోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఫేక్ అధికారులు, డాక్టర్ల కేసులు చాలా వెలుగులోకి వస్తున్నాయి.