అమలాపురంలో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదని ఏపీ రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. ఈ విషయమై విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
శ్రీకాకుళం: Amalapuram లో విధ్వంసం జరుగుతుందని ఊహించలేదని ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి Taneti Vanita చెప్పారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్ల దాడికి దిగారన్నారు.
గురువారం నాడు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ హోం మంత్రి తానేటి వనిత ఓ తెలుగు న్యూస్ చానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామంటే ఎందుకు అడ్డుకోవాలన్నారు. అందుకే జేఏసీ నేతలను కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారని కూడా హోం మంత్రి గుర్తు చేశారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ Konaseema జిల్లా పెట్టాలని ఆందోళనలు సాగిన సమయంలో TDP, Jana Sena నేతలు ఈ ఆందోళనలకు మద్దతు పలికారా లేదా అని మంత్రి వనిత ప్రశ్నించారు. ఈ విషయమై ధర్నాలు, నిరహార దీక్షలు ఎవరూ చేశారో కూడా అందరికీ తెలుసునన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చిన తర్వాత పార్టీలు మాట మార్చాయని ఆమె విమర్శించారు.
undefined
కోనసీమ జిల్లాకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని పార్టీలు స్పష్టం చేయాలని ఆమె కోరారు. అమలాపురం విధ్వంసం వెనుక అసాంఘిక శక్తులున్నాయన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలని పన్నాగం పన్నారని హోం మంత్రి తానేటి వనిత ఆరోపించారు.
also read:‘ఆ వెధవను మీ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు’..సజ్జలకు నాగబాబు కౌంటర్..
రాళ్ల దాడి జరుగుతున్నా ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు సంయమనం పాటించారని మంత్రి గుర్తు చేశారు. ఆందోళనకారులను అక్కడి నుండి పంపే ప్రయత్నం చేశారని మంత్రి వివరించారు. అన్యం సాయి జనసేన నేతే అవునో కాదో చెప్పాలన్నారు. అమలాపురం విధ్వంసానికి పాల్పడిన వారిలో 70 మందిని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 40 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని మంత్రి వివరించారు.
అమలాపురంలో విధ్వంసం వెనుక ఎవరున్నారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారి నుండి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.ఈ కేసులో అరెస్టు చేసిన వారిపై కఠిన శిక్షలు నమోదు చేస్తామని కూడా ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ ప్రకటించారు. నిన్న రావులపాలెంలో కూడా ఎస్పీ వాహనంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు.
కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలని కోరతూ ఈ నెల 24న కలెక్టరేట్ ముట్టడి విధ్వంసానికి దారి తీసింది. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 9 గంటల వరకు విధ్వంసం కొనసాగింది. ఇతర జిల్లాల నుండి అదనపు పోలీసు బలగాలు వచ్చిన తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లను ఆందోళనకారులు నిప్పు పెట్టారు. బస్సులను కూడా దగ్ధం చేశారు.పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు.ఈ దాడిలో డీఎస్సీ సహా 20 మంది పోలీసులకు కూడా గాయలయ్యాయి. ఎస్పీ సుబ్బారెడ్డి మాత్రం రాళ్ల దాడి నుండి తృటిలో తప్పించుకున్నాడు.