ఖజానా నుంచి చర్చిలు, మసీదుల్లోని వారికే ఇస్తారా... మరి అర్చకుల సంగతేంటీ: జగన్‌పై సోము వీర్రాజు ఫైర్

By Siva KodatiFirst Published Aug 12, 2021, 6:51 PM IST
Highlights

చర్చిలు, మసీదుల్లో పనిచేసేవారికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడమేంటని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రశ్నించారు. అర్చకులకు వైసీపీ ప్రభుత్వం ఖజానా నుంచి  ఎందుకు చెల్లించదని ఆయన నిలదీశారు. చర్చిలను ఏ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోందో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు

వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హిందుత్వ వ్యతిరేక విధానాలతోనే జగన్ పాలన నడుస్తోందని ఆరోపించారు. చర్చిలు, మసీదుల్లో పనిచేసేవారికి ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడమేంటని వీర్రాజు ప్రశ్నించారు. అర్చకులకు వైసీపీ  ప్రభుత్వం ఖజానా నుంచి  ఎందుకు చెల్లించదని ఆయన నిలదీశారు. చర్చిలను ఏ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోందో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

ఈ విధంగా భారతదేశంలో ఎక్కడా జరగలేదని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీకి హిందువులు కూడా ఓట్లేసిన సంగతిని మరిచిపోయారా అంటూ సోము వీర్రాజు మండిపడ్డారు. టీటీడీ రూ.3 వేల కోట్ల బడ్జెట్‌లో వెయ్యి కోట్లను హిందుత్వానికే ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  కేంద్ర ఉపాధి హామీ నిధులను వైసీపీ సర్కార్ ఇష్టానుసారంగా వినియోగిస్తోందని వీర్రాజు ఆరోపించారు. ఆలయాల పవిత్రపై అవగాహన లేనివాళ్లు మంత్రులుగా వున్నారంటూ దుయ్యబట్టారు. ఒక్క శాతం కూడా వైసీపీ ప్రభుత్వం హిందూ మతానికి ఖర్చు చేయడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. 

click me!