వివాహేతర సంబంధం : ప్రేయసి ఇంటివరండాలో ఉరి వేసుకున్న యువకుడు..

Published : Jul 06, 2022, 12:29 PM IST
వివాహేతర సంబంధం : ప్రేయసి ఇంటివరండాలో ఉరి వేసుకున్న యువకుడు..

సారాంశం

ప్రేయసి ఇంటి వరండాలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో కనిపించాడు. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

బాపట్ల : వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. యువతి ఇంటి వరండాలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం కారంచేడులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పేరలిపాడు గ్రామానికి చెందిన పేర్లి సురేష్(35) కొంతకాలంగా కారంచేడు గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి ఇంటి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ, తెల్లవారేసరికి సురేష్  తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతికి చెందిన ఇంటి వరండాలో ఉరేసుకొని మృతి చెంది కనిపించాడు.  

అతడిని చంపి, ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇతని భార్య ధనలక్ష్మి అతని ప్రవర్తన కారణంగానే కొద్దిరోజుల కిందట అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. మృతుడికి చందు, కిరణ్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించామని,  తన తమ్ముడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని సోదరుడు ఇమ్మాన్యుయేల్  స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీలో నలుగురు మత్య్సకారుల ఆచూకీ గల్లంతు: కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఇదిలా ఉండగా, కర్ణాటకలోని యశ్వంతపురలో జూలై 2న ఘోర సంఘటన జరిగింది. భార్య వేరొకరితో వెళ్లిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. ఏం చేస్తున్నాడో తెలియని మానసిక స్థితిలో ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్యచేశాడు. ఈ ఘటన కర్నాటక కలబురిగిలో జరిగింది. వివరాలు.. భోవి నగరకు చెందిన లక్షీకాంత్, అంజలి దంపతులకు నలుగురు సంతానం. లక్ష్మికాంత్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంజలి ఇటీవల వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. ఇదికాస్తా ముదిరి ప్రియునితో కలిసి పారిపోయింది. దీంతో లక్ష్మీకాంత్, అంజలిల నలుగురు పిల్లలను అవ్వ దగ్గర ఉంచాడు.

బుధవారం రాత్రి నలుగురు పిల్లలకు చిరుతిళ్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. ఇద్దరిని ఆటోలో కూర్చోబెట్టి, మరో ఇద్దరు కూతుళ్లు.. సోని (11), మయూరి (10)లను పక్కకు తీసుకెళ్లి గొంతు పిసికి చంపాడు. ఇద్దరి మృతదేహాలను ఆటోలో పెట్టుకొని నేరుగా ఎంబీ నగర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణం నగరంలో సంచలనం కలిగించింది. లక్ష్మీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. 
 

PREV
click me!

Recommended Stories

Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ | Asianet News Telugu
Markapuram Bus Accident Aftermath | Vehicles Removed Using Crane Accident Spot | Asianet News Telugu