అనకాపల్లి ఫ్లైఓవర్ ప్రమాదం: మెటీరియల్ పర్ఫెక్ట్.. నిర్లక్ష్యమే కొంపముంచింది, నివేదికలో సంచలన విషయాలు

By Siva KodatiFirst Published Jul 8, 2021, 4:35 PM IST
Highlights

అనకాపల్లి వంతెన ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జి శిథిలాల నుంచి సేకరించిన నమూనాలను ఆంధ్రా యూనివర్సిటీలో పరీక్షిస్తున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి వద్ద ఫ్లైఓవర్ కూలిన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. అయితే ఈ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వున్నట్లుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థ నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని దాదాపు నిర్థారణకు వచ్చినట్లుగా సమాచారం. నిర్మాణంతో పాటు బ్రిడ్జి ఎగ్జిక్యూషన్‌లో లోపాలు వున్నట్లుగా తెలుస్తోంది. అయితే మెటీరియల్ పరంగా ఇబ్బంది లేదని నిపుణులు నిర్థారణకు వచ్చినట్లుగా సమాచారం.

Also Read:అనకాపల్లిలో కూలిన బ్రిడ్జి పిల్లర్: నిర్మాణసంస్థతో పాటు మరో ఇద్దరిపై కేసు

క్రాస్ గడ్డర్స్ కనెక్షన్ కోసం సమయం పట్టడంతో ఎలాంటి జాగ్రత్తలు పాటించలేదని లాకింగ్ వ్యవస్థ కూడా సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇంజనీరింగ్ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. బ్రిడ్జి శిథిలాల నుంచి సేకరించిన నమూనాలను ఆంధ్రా యూనివర్సిటీలో పరీక్షిస్తున్నారు. రీబౌండ్ హ్యామర్, అల్ట్రాసోనిక్ పల్స్ వెలాసిటీ, కోర్ కటింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు నిపుణులు. ఇదిలావుంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడికి నివేదిక అందజేయనున్నారు ఆంధ్రా యూనివర్సిటీ నిపుణులు. 

click me!