టీడీపీలోకి కిశోర్ చంద్రదేవ్...24న ముహూర్తం

By Siva KodatiFirst Published Feb 18, 2019, 1:11 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారు. సోమవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని తొక్కేశారన్నారు. 

లౌకికవాదం లేకుండా సామ్యవాద సిద్ధాంతాలను మరిచి ప్రధాని పాలన సాగిస్తున్నారని కిశోర్ ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని.. దాని కోసం తెలుగుదేశం పార్టీ సరైనదని తాను నిర్ణయించుకున్నట్లు కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు. ఈ నెల 24న టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

గతంలో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే గెలిచానని, ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీటు కావాలని భావించి ఉంటే తాను 2014లోనే పార్టీ మారేవాడినని స్పష్టం చేశాడు.

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబం, మా కుటుంబం ఎప్పుడూ సన్నిహితంగానే మెలిగా వాళ్లమని, మరోసారి అశోక్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని కిశోర్ హర్షం వ్యక్తం చేశారు. 

click me!