పవన్ కు కౌన్సిలింగ్ అవసరం:దేవినేని

Published : Oct 17, 2018, 08:55 PM IST
పవన్ కు కౌన్సిలింగ్ అవసరం:దేవినేని

సారాంశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో నాణ్యతపై పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని  దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం పనుల్లో నాలుగు రకాల క్వాలిటీ చెకింగ్ జరుగుతోందన్నారు. 

విజయవాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌ పనుల్లో నాణ్యతపై పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని  దేవినేని ఉమ విమర్శించారు. పోలవరం పనుల్లో నాలుగు రకాల క్వాలిటీ చెకింగ్ జరుగుతోందన్నారు. పవన్ కళ్యాణ్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ అంశంలో పవన్ కళ్యాణ్ కు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 

సీఎం చంద్రబాబును విమర్శించే అర్హత పవన్, జగన్‌కు లేదని చెప్పారు. సర్ అర్థర్ కాటన్ లాంటి మహానుభావులకే విమర్శలు తప్పలేదన్నారు. బీజేపీ నాటకంలో పవన్, జగన్ పాత్రధారులు అని ఆరోపించారు. బీజేపీ ఆడమంటే పవన్, జగన్ లు ఆడుతున్నారంటూ మండిపడ్డారు.  

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu