జగన్ వల్ల ఒరిగిందేం లేదు.. వైసీపీలోకి వెళ్లినవాళ్లంతా మళ్లీ టీడీపీలోకే : మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 26, 2022, 02:24 PM IST
జగన్ వల్ల ఒరిగిందేం లేదు.. వైసీపీలోకి వెళ్లినవాళ్లంతా మళ్లీ టీడీపీలోకే : మాగంటి బాబు సంచలన వ్యాఖ్యలు

సారాంశం

వైసీపీలోకి వెళ్లిన వాళ్లంతా తిరిగి టీడీపీలోకి వస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ మాగంటి బాబు. జగన్ రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని.. ఆయన వల్ల ఏపీకి ఒనగూరింది ఏం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

టీడీపీ (tdp) సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు (maganti babu) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలోకి (ysrcp) వెళ్లనని .. ఆ పార్టీలోకి వెళ్లిన వాళ్లు కూడా త్వరలోనే టీడీపీలోకి తిరిగి వస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై (ys jagan) ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్... రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదని... అక్రమ అరెస్ట్ లు, పోలీసుల దౌర్జన్యాలు, మంత్రుల దుర్భాషలు, ఎమ్మెల్యేల రౌడీయిజమే మిగిలాయని ఎద్దేవా  చేశారు. 

మహానాడుతో (tdp mahanadu) రాష్ట్ర ప్రజలకు ఒక శుభ సమయం ప్రారంభం కాబోతోందని జోస్యం చెప్పారు. ఏలూరు పార్లమెంటు రాజకీయాల్లోనే తాను ఉంటానని మాగంటి బాబు తెలిపారు. కాగా.. ఆయన ఇద్దరు కుమారులు మరణించప్పటి నుంచి బాబు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఇంట్లోనే వుంటూ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. తాజాగా మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. 

కొద్దినెలల క్రితం మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ (maganti ramji) మరణించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయన కొద్ది రోజుల పాటు ఏలూరు ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను విజయవాడ ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో రాంజీ తుది శ్వాస విడిచారు.

దీని నుంచి కోలుకోకముందే.. మాగంటి బాబు రెండో కుమారుడు మాగంటి రవీంద్ర (maganti ravindranath) మృతిచెందారు. మద్యానికి బానిసైన రవీంద్రను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆయన ఆసుపత్రి నుంచి తప్పించుకుని హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తలదాచుకున్నారు. ఈ క్రమంలో రక్తపు వాంతులతో అదే హోటల్‌లోనే రవీంద్ర కన్నుమూశారు. నెలల వ్యవధిలో ఇద్దరు కుమారులు మరణించడంతో మాగంటి బాబు కృంగిపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!