చంద్రబాబు ‘పీకే ముఖ్యమంత్రి’: వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్

First Published Jul 2, 2018, 2:55 PM IST
Highlights

చంద్రబాబు ‘పీకే ముఖ్యమంత్రి’: వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ 

60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన చంద్రబాబును కచ్చితంగా ‘పీకే ముఖ్యమంత్రి’ అనొచ్చు అంటూ ధ్వజమెత్తారు తిరుపతి వైసీపీ మాజీ  ఎంపీ వరప్రసాద్. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఇవాళ అనంతపురంలో జరిగిన వంచన దీక్షలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షల రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు తొలగించారన్నారు. ఆయన ఒక పిరికిపంద అని.. ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా అని ప్రశ్నించారు.. సింహం సింగిల్‌గా వస్తుంది.. పిరికివాడు భయపడుతూ ముందుకు వెళ్తాడని.. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు.

పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగి.. ఆ తర్వాత ప్యాకేజ్ సరిపోతుందని చెప్పి.. మళ్లీ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దళితులంటే గౌరవం లేదని.. వారిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు.     
 

click me!