కాంగ్రెస్, టీడీపీ ఒక్కటేగా.. కేవీపీపై ఉమా వ్యాఖ్యలేంటీ: ఉండవల్లి

By Siva KodatiFirst Published May 7, 2019, 11:07 AM IST
Highlights

పోలవరం నిర్మాణంలనో ఏ చిన్న పొరబాటు చేసినా జరిగే నష్టం ఊహకు కూడా అందదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్

పోలవరం నిర్మాణంలనో ఏ చిన్న పొరబాటు చేసినా జరిగే నష్టం ఊహకు కూడా అందదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన జూన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ పూర్తై పోతుందని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత వచ్చే ఏడాది అని మాట మార్చిందని ఉండవల్లి ఎద్దేవా చేశారు.

దీని వెనుక వున్న కారణాలు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుడికాల్వకు సంబంధించిన పనులు పూర్తి కావొచ్చాయని.. కానీ ఎడవ కాలువకు సంబంధించిన పనులు ఇంత వరకు అతి గతి లేవని మండిపడ్డారు.

తన అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగంగా క్షమాపణలు చెబుతానని ఉండవల్లి స్పష్టం చేశారు. కేవీపీ రామచంద్రరావు కేసుకు.. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని అది కేంద్రప్రభుత్వంపై వేసిన కేసని ఉండవల్లి తెలిపారు.

పోలవరం ప్రాజెక్ట్‌ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఉండవల్లి మండిపడ్డారు. కేవీపీపై దేవినేని ఉమా వ్యాఖ్యలు సరికావన్నారు.

రామచంద్రరావు కేసు వల్ల రాష్ట్రప్రభుత్వానికే మేలు జరుగుతుందని అరుణ్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ ప్రస్తుతం ఒక్కటైన నేపథ్యంలో కేవీపీపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.  2020కి కూడా పోలవరం పూర్తవుతుందన్న గ్యారెంటీ లేదని ఉండవల్లి సందేహం వ్యక్తం చేశారు. 
 

click me!