సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్.. టీడీపీ నేత, ఆయన కుమారుడు అరెస్ట్

By telugu teamFirst Published May 7, 2019, 10:50 AM IST
Highlights


సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసులో... ఓ టీడీపీ నేత, ఆయన కుమారుడుని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన టీడీపీ నేత... కిడ్నాప్ కి గురైన వ్యక్తి ఇద్దరూ బంధువులు కావడం గమనార్హం.


సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసులో... ఓ టీడీపీ నేత, ఆయన కుమారుడుని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన టీడీపీ నేత... కిడ్నాప్ కి గురైన వ్యక్తి ఇద్దరూ బంధువులు కావడం గమనార్హం.

కేసు పూర్తి వివరాల్లోకి వెళితే....  గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడు  యర్రంశెట్టి వేణు గోపాల్ కుమారుడు విజయ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడని.. అతని బంధువు నిలయ్ కూడా సాఫ్ట్ వేర్ కాగా పనిచేస్తున్నాడు. కాగా... వీరిద్దరూ కలిసి కొంతకాలం క్రితం వ్యాపారం ప్రారంభించారు.

ఈ వ్యాపారానికి విజయ్ రూ.35లక్షల పెట్టుబడి పెట్టాడు. అయితే... తీరా వ్యాపారంలో నష్టం రావడంతో.. విజయ్ కి డబ్బులు ఇవ్వకుండా నిలయ్ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన విజయ్... వారం రోజుల క్రితం నిలయ్ ని కిడ్నాప్ చేశాడు. వదిలపెట్టమని నిలయ్ భార్య అలేఖ్య, అతని తల్లిదండ్రులు వేడుకున్నా వదిలిపెట్టలేదు. నా డబ్బులు ఇస్తేనే వదిలేస్తానని చెప్పాడు.

అక్కడితో ఆగకుండా నిలయ్ భార్యను, తల్లిదండ్రులను కూడా గదిలో నిర్భందించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసుకుని.. కిడ్నాప్ గురైన నిలయ్.. అతని కుటుంబసభ్యులను విడిపించారు. కిడ్నాప్ చేసిన విజయ్.... అతని తండ్రి, టీడీపీ నేత వేణుగోపాల్ ని అరెస్టు చేశారు. 

click me!