చిక్కుల్లో ఎస్వీ యూనివర్శిటీ రెక్టార్: విద్యార్థుల ఆందోళన

By narsimha lodeFirst Published May 7, 2019, 10:38 AM IST
Highlights

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.  ఇదే యూనివర్శిటీకి చెందిన రెక్టార్ ప్రోఫెసర్ జానకీరామయ్య ప్రైవేట్ బీఈడీ కాలేజీల యాజమాన్యంతో  సంభాషణ వివాదాస్పదంగా మారింది.


తిరుపతి: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో అక్రమ నియామకాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.  ఇదే యూనివర్శిటీకి చెందిన రెక్టార్ ప్రోఫెసర్ జానకీరామయ్య ప్రైవేట్ బీఈడీ కాలేజీల యాజమాన్యంతో  సంభాషణ వివాదాస్పదంగా మారింది.

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలోని రెక్టార్ ప్రోఫెసర్ జానకీరామయ్య ప్రైవేట్ బీఈడీ కాలేజీల యాజమాన్యంతో  జరిపినట్టుగా ఓ ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయమై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.  

దీనికి వ్యతిరేకంగా రెక్టార్ ప్రోఫెసర్ జానకీ రామయ్య‌కు మద్దతుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన సంఘాలు విద్యార్థి సంఘాలలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. రెండు వర్గాలు పోటాపోటీగా ఆందోళనలకు దిగాయి.మరో వైపు ఇదే యూనివర్శిటీలో రిజిస్ట్రార్ అనురాధ నియామకం విషయంలో అక్రమాలు చోటు చేసుకొన్నాయని కూడ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. 

ఈ యూనివర్శిటీలో చోటు చేసుకొన్న పరిణామాలపై వీసీకి విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ విషయమై తాను ఏమీ చేయలేనని వీసీ చేతులెత్తేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ రెండు ఘటనలపై విచారణకు కమిటీ ఏర్పాటు చేస్తే అవినీతిని నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నామని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి.ఈ ఫిర్యాదుల విషయం తెలుసుకొన్న వీసీ రాజేంద్రప్రసాద్ స్పందించారు. ఈ విషయాలు తనకు షాక్‌కు గురిచేశాయని వీసీ అభిప్రాయపడ్డారు.

click me!