మోడీదే హవా.. జమిలితో ప్రాంతీయ పార్టీలు గల్లంతే: జేసీ దివాకర్ రెడ్డి

By Siva KodatiFirst Published Sep 14, 2019, 10:47 AM IST
Highlights

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నరేంద్రమోడీ హవా నడుస్తోందని..అందుకే నేతలు బీజేపీవైపు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత , మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో నరేంద్రమోడీ హవా నడుస్తోందని..అందుకే నేతలు బీజేపీవైపు చూస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు చేసిన తప్పులు.. మోడీ పథకాలే పార్టీ మార్పునకు కారణమన్నారు. దేశంలో జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమేనని జేసీ స్పష్టం చేశారు. జగన్ 100 రోజుల పాలనపై ఏడాది తర్వాత మాట్లాడుతానని దివాకర్ రెడ్డి అన్నారు.

అప్పట్లో ప్రధాని మోడీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము హిట్లర్‌ను చూడలేదని.. కానీ ఆయన వ్యవహరశైలి అదే రకంగా ఉందన్నారు. తాజాగా ఇప్పుడు మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తుండటంతో జేసీ బ్రదర్స్ కాషాయ కండువా కప్పుకుంటారా అన్న చర్చ తాడిపత్రిలో మొదలైంది. 

click me!