జనసేనలోకి మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు.. పవన్ సమక్షంలో చేరిక, జనసైనికుల్లో జోష్

Siva Kodati |  
Published : Mar 12, 2023, 05:56 PM IST
జనసేనలోకి మాజీ ఎమ్మెల్యేలు టీవీ రామారావు, ఈదర హరిబాబు.. పవన్ సమక్షంలో చేరిక, జనసైనికుల్లో జోష్

సారాంశం

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు.   

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని అన్ని రకాలుగా బలోపేతం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. త్వరలోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. అలాగే పార్టీలో చేరికలకు కూడా పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే జనసేన పెద్దలతో టచ్‌లో వున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆదివారం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వీరితో పాటు భీమిలీకి చెందిన కొందరు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరారు. 

ఇదిలావుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మరికొద్దినెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టికెట్ వస్తుందన్న భరోసా వుంటే ఓకే.. లేనిపక్షంలో పార్టీ మారేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేశారు. ముఖ్యంగా అధికార వైపీపీకి చెందిన పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీ, జనసేన నేతలతో టచ్‌లో వున్నారు. తాజాగా వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కమల హాజరుకావడం రాజధాని ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీలో వుండి జనసేన పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్లడం ఏంటంటూ చర్చ నడుస్తోంది. త్వరలోనే కాండ్రు కమల జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. 

Also REad: టీడీపీ మంచిగా వుంటూనే.. నేను మెత్తని మనిషిని కాదు , మొహమాటాల్లేవ్ : పొత్తులపై మారిన పవన్ స్వరం

మంగళగిరిలో బలంగా వున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంతో ఆమె రాజకీయాలకు దూరంగా వుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్‌కు కన్ఫర్మ్ చేయడంతో కమల నిరాశకు లోనయ్యారు. అయితే 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆమె అధికార పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఏ కార్యక్రమానికి కమల హాజరుకావడం లేదు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu