చంద్రబాబుకు ఏపీలో మరో షాక్: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి రాజీనామా

Published : Jul 17, 2021, 10:17 AM IST
చంద్రబాబుకు ఏపీలో మరో షాక్: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి రాజీనామా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగిలింది. ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి టీడీపీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబుకు షాక్ తగిలింగిది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదనే మనోవేదనతో ఆమె టీడీపీని వీడారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్ కోట నుంచి ఆమె గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ అనుబంధ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలిగా కూడా ఆమె పనిచేశారు.  పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక తాను రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. శోభా హైమవతి త్వరలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. కొంత మంది నాయకులు ఇప్పటికే పార్టీని వీడారు.

మరోవైపు తెలంగాణలో కూడా టీడీపీ భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఏకంగా టీడీపీ తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ లో చేరారు. దీంతో తెలంగాణలో టీడీపీ మరింతగా సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దాదాపుగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయినట్లుగా భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?