తమ పార్టీ చేపట్టిన ఈ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ చింతమనేని ప్రకటించడంతో.... అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చింతమనేని గృహనిర్భందం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇబ్బందులపై తెలుగుదేశం పార్టీ శుక్రవారం ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా... ఈ ఆందోళనలను భగ్నం చేసేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఏలూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని గృహ నిర్భందం చేశారు.
తమ పార్టీ చేపట్టిన ఈ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ చింతమనేని ప్రకటించడంతో.... అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చింతమనేని గృహనిర్భందం చేశారు.
undefined
దీంతో పోలీసులు గో బ్యాక్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. అదేవిధంగా కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు బచ్చుల అర్జునుడిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా గుంటూరులో శుక్రవారం ఉదయం నుంచి టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ లో ఎమ్మెల్యే మద్దాలి గిరి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూనగర్ లో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జి నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.