గెజిట్ లేకపోతే సచివాలయంలో ఎందుకు కూర్చుని పాలన చేస్తున్నారంటూ బొత్సను నిలదీశారు యనమల. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్రమోదీ అని తెలియదా అంటూ నిలదీశారు. రాజధాని భవనాలను పాలనకు ఎలా వాడుతున్నారంటూ ప్రశ్నించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతే రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదంటూ చేసిన బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డారు.
గెజిట్ లేకపోతే సచివాలయంలో ఎందుకు కూర్చుని పాలన చేస్తున్నారంటూ బొత్సను నిలదీశారు యనమల. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్రమోదీ అని తెలియదా అంటూ నిలదీశారు. రాజధాని భవనాలను పాలనకు ఎలా వాడుతున్నారంటూ ప్రశ్నించారు.
అమరావతి రాజధాని కాకపోతే సీఎం జగన్ అమరావతిలో రాజధాని భవనాల్లో ఉంటూ పాలన ఎలా కొనసాగిస్తున్నారంటూ నిలదీశారు. రాజధానిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయోద్దంటూ హితవు పలికారు మాజీమంత్రి బొత్స సత్యనారాయణ.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతి రాజధాని అని గత ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందా...?: రాజధానిపై బొత్స వ్యాఖ్యలు