వెన్నుపోటు ఎపిసోడ్‌లో చంద్రబాబుతో చేతులు కలపలేదా .. రజనీ సినిమాల్లోనే సూపర్‌స్టార్ : వెల్లంపల్లి శ్రీనివాస్

Siva Kodati |  
Published : Apr 29, 2023, 03:39 PM IST
వెన్నుపోటు ఎపిసోడ్‌లో చంద్రబాబుతో చేతులు కలపలేదా .. రజనీ సినిమాల్లోనే సూపర్‌స్టార్ : వెల్లంపల్లి శ్రీనివాస్

సారాంశం

రజనీకాంత్ సినిమాల్లో సూపర్‌స్టార్ అని.. రాజకీయాల్లో మాత్రం అవగాహన లేని వ్యక్తని దుయ్యబట్టారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కేసీఆర్ కట్టినట్లు చంద్రబాబు శాశ్వత సచివాలయాన్ని ఎందుకు కట్టలేకపోయారని వెల్లంపల్లి ప్రశ్నించారు. 

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబును ప్రశంసిస్తూ తలైవా చేసిన ప్రసంగంపై వారు మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ సినిమాల్లో సూపర్‌స్టార్ అని.. రాజకీయాల్లో మాత్రం అవగాహన లేని వ్యక్తని దుయ్యబట్టారు. సొంతంగా గెలిచే సత్తా లేకే.. చంద్రబాబు రజనీకాంత్‌ను తెచ్చారని వెల్లంపల్లి ఆరోపించారు . ఎంతమంది రజనీలు వచ్చినా ప్రజలు నమ్మరని.. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయమని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ రాజకీయాలపై రజనీకాంత్‌కు అవగాహన లేదని.. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజనీ కూడా చంద్రబాబుతో చేతులు కలిపారన్న విషయం అందరికీ తెలుసునని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు ఆర్పించడం విడ్డూరంగా వుందన్నారు. కేసీఆర్ కట్టినట్లు చంద్రబాబు శాశ్వత సచివాలయాన్ని ఎందుకు కట్టలేకపోయారని వెల్లంపల్లి ప్రశ్నించారు. రజనీకాంత్ ముందు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని.. వెల్లంపల్లి చురకలంటించారు. సినిమా యాక్టర్లు చంద్రబాబు స్క్రిప్ట్ చదివి వెళ్తారని.. జనానికి మాత్రం అసలు విషయాలు తెలుసునని శ్రీనివాసరావు అన్నారు. ఇక గతంలో ప్రధాని నరేంద్ర మోడీని తిట్టి.. నేడు ప్రశంసిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. 

Also Read: రజనీకాంత్ మరింత దిగజారిపోయారు.. పవన్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు చంద్రబాబు ప్లాన్: కొడాలి నాని

అంతకుముందు చంద్రబాబు నాయుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసిరినప్పుడు చంద్రబాబుకు రజనీకాంత్ మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అటువంటి రజనీకాంత్ ఈరోజు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం శోచనీయమని అన్నారు. వెధవలంతా చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు రజనీకాంత్ ఏం చేశారని ప్రశ్నించారు. రజనీకాంత్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవుతూ మరింత దిగజారిపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు. చంద్రబాబు  కుట్ర రాజకీయాలను పవన్ కల్యాణ్ గ్రహించాలని అన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్