వైసీపీ లో చేరిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్

Published : May 10, 2018, 12:17 PM IST
వైసీపీ లో చేరిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్

సారాంశం

మాజీ మంత్రి కుమారుడి వైసీపీలో చేరిక 

మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెంకట కృష్ణప్రసాద్... గురువారం వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మండవల్లిలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కాగా... కృష్ణప్రసాద్ స్వగ్రామమైన నందిగామ మండలం ఐతవరం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మండవల్లికి చేరుకున్న అనంతరం వైఎస్ జగన్‌ను కలిసి వైసీపీలో చేరారు. అలాగే జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా కృష్ణ ప్రసాద్‌తో కలిసి పాదయాత్ర వద్దకు తరలివచ్చారు.

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu