టీడీపీలో కోండ్రు మురళీ చిచ్చు: సీఎంను కలిసిన ప్రతిభాభారతి

By rajesh yFirst Published Sep 5, 2018, 3:30 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ను టీడీపీలోకి తీసుకోవడంతో ప్రతిభాభారతి ఆగ్రహంతో ఉన్నారు. గత ఏడాది కోండ్రు మురళీమోహన్ ను టీడీపీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. 

అమరావతి: శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. ఇప్పటి వరకు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అసంతృప్తితో రగిలిపోతున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి మాజీమంత్రి కోండ్రు మురళీ మోహన్ ను టీడీపీలోకి తీసుకోవడంతో ప్రతిభాభారతి ఆగ్రహంతో ఉన్నారు. 

గత ఏడాది కోండ్రు మురళీమోహన్ ను టీడీపీలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది. అయితే అందుకు ప్రతిభాభారతి అంగీకరించకపోవడంతో కోండ్రు మురళీ మోహన్ కాంగ్రెస్ లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

అయితే తాజాగా కోండ్రు మురళీమోహన్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు ప్రతిభాభారతి. కోండ్రు మురళీ మోహన్ కు రాజాం టికెట్ ఇస్తారని ఆ హామీతోనే కోండ్రు టీడీపీ కండువా కప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో ప్రతిభా భారతి అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. 

రాజాం నియోజకవర్గంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు నాయుడుతో చర్చించారు. నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయని చంద్రబాబు దగ్గర పంచాయితీ పెట్టారు. నియోజకవర్గంలో కొందరు గ్రూపులు కట్టేలా కొందరు ప్రోత్సహిస్తున్నారంటూ పార్టీలోకి రాకుండానే కోండ్రు మురళీపై ఫిర్యాదు చేశారు. 

అలాగే కోండ్రు మురళీ పార్టీలో చేరితే తన భవిష్యత్ ఏంటన్నదానిపై కూడా చంద్రబాబుతో చర్చించారు. పార్టీ బలోపేతం కోసం చేరికలు తప్పవన్న చంద్రబాబు పార్టీలో తనకి అత్యంత ప్రాధాన్యత ఉందని అది ఏ మాత్రం తగ్గదని భరోసా ఇచ్చినట్లు ప్రతిభా భారతి తెలిపారు. చంద్రబాబు భరోసాతో సంతృప్తిగా ఉన్నానన్నారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు మాజీమంత్రి కోండ్రు మురళీమోహన్ ఈనెల 6న సాయంత్రం 6గంటల 15 నిమిషాలకు అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో సైకిలెక్కనున్నారు. వాస్తవానికి గత నెల 31న టీడీపీలో చేరాల్సి ఉంది. అయితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మరణించడంతో చేరిక వాయిదా పడింది.

click me!