గనులు, లిక్కర్, ఇసుక అయిపోయాయి.. ఇప్పుడే జగన్ టార్గెట్ పేదలే: టీడీపీ నేత పీతల సుజాత

Siva Kodati |  
Published : Dec 11, 2021, 04:36 PM IST
గనులు, లిక్కర్, ఇసుక అయిపోయాయి.. ఇప్పుడే జగన్ టార్గెట్ పేదలే: టీడీపీ నేత పీతల సుజాత

సారాంశం

వైసీపీ (ysrcp)  ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ (tdp) నేత పీతల సుజాత. ఇప్పటి వరకు గనులు, లిక్కర్, భూకబ్జాలు, ఇసుకను దోచుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు పేదలను కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైసీపీ (ysrcp)  ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి, టీడీపీ (tdp) నేత పీతల సుజాత (peethala sujatha). శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇప్పటి వరకు గనులు, లిక్కర్, భూకబ్జాలు, ఇసుకను దోచుకున్న వైసీపీ నేతలు... ఇప్పుడు పేదలను కూడా దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు చేసిన పనులను తామే చేసినట్టుగా జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని ఆమె విమర్శించారు.

1983 నుంచి పేదలకు ప్రభుత్వాలు ఇళ్లను కట్టించాయని... ఇప్పుడు వన్ టైమ్ సెటిల్మెంట్ (one time settlement scheme) పేరుతో వేల కోట్లను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని సుజాత దుయ్యబట్టారు. ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టొద్దని... టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని ఆమె తెలిపారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సుజాత పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ వైసీపీ పాలన సాగుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:మాట తప్పారు, మడమ తిప్పారు: ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై జగన్ పై బాబు ఫైర్

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీల విషయంలో జగన్ ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాటను  అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో తొక్కారన్నారు. ప్రత్యేక హోదాపై వైసీపీ ఎందుకు పోరాటం చేయడం లేదని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. Special stutus పై ycp కి చిత్తశుద్ది ఉంటే ఆ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే తమ పార్టీ ఎంపీలంతా కూడా రాజీనామాలు చేస్తారని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ప్రత్యేక హోదా ముగిసన అధ్యాయమని మరోసారి పార్లమెంట్ వేదికగా కేంద్రం ప్రకటించినా కూడా వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. గతంలో తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని... ప్రత్యేక హోదా కోసం కేంద్రం నుండి వైదొలిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ప్రత్యేక హోదాతో పాటు Visakha steel facotory, , రైల్వే జోన్ అంశాలపై  ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!