
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే స్థితిలో లోకేష్ వున్నారా అని ప్రశ్నించారు. జగన్‌ను అంత అగౌరవంగా మాట్లాడతారా అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాట్లాడితే మళ్లీ ఏడుస్తూ కూర్చుంటారని ఆయన సెటైర్లు వేశారు. అయ్యన్న గంజాయి మత్తులో మాట్లాడినట్లు అనిపిస్తోందని.. రాజధానిపై తమ ప్రభుత్వానికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదన్నారు. అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాలను తొలగిస్తామని చింతమనేని అన్నారని.. వైఎస్ విగ్రహాలను టచ్ చేసి చూస్తే తెలుస్తుందని కన్నబాబు హెచ్చరించారు.
అటు మాజీ మంత్రి కొడాలి నాని సైతం చంద్రబాబు, లోకేష్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ యాత్రను జనం పట్టించుకోకపోవడంతో చంద్రబాబుకు పిచ్చెక్కిందన్నారు. తాను బూతులు మాట్లాడుతా అనే వాళ్లకి చంద్రబాబు , లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని నాని ప్రశ్నించారు. తాను బూతులు మాట్లాడతాననే వాళ్లకు చంద్రబాబు, లోకేష్ మాట్లాడే మాటలు వినిపించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీమ బిడ్డ కాబట్టే సొంతంగా పార్టీ పెట్టి సీఎం అయ్యారని.. లోకేష్ తన డీఎన్ఏ ఏంటో చెక్ చేయించుకోవాలని చురకలంటించారు. జగన్ రాయలసీమలో పుట్టగా.. లోకేష్ తెలంగాణలో పుట్టారని ఆయన గుర్తు చేశారు.
ALso REad: జగన్‌ది రాయలసీమ డిఎన్ఏ: చంద్రబాబు, లోకేష్‌లపై కొడాలి ఫైర్
కడప జిల్లాలో జగన్ పుట్టినందునే సోనియా గాంధీని వ్యతిరేకించి పార్టీని ఏర్పాటు చేశారని కొడాలి నాని చెప్పారు. తెలంగాణలో పుట్టి పెరిగిన లోకేష్ ఇవాళ ఏపీలో తిరుగుతూ జగన్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసునని చెప్పారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలేనని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో వర్షాలు కురిశాయా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నిష్ట దరిద్రుడని..అవినీతి సొమ్మును ఆయన హెరిటేజ్ సంస్థలో దాచాడని నాని విమర్శించారు. అవినీతితోనే రెండెకరాల నుండి రూ. 2 లక్షల కోట్లకు చంద్రబాబు చేరాడన్నారు. ఆయనను అవినీతి చక్రవర్తి అంటూ ఎన్టీఆర్ ఆనాడే చెప్పారని కొడాలి నాని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వారసులంతా సామాన్యుల్లా బతుకుతుంటే చంద్రబాబునాయుడు మాత్రం కోట్లకు పడగలెత్తారన్నారు.