వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కారు ప్రమాదానికి గురైంది. దుర్గగుడి సమీపంలో చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎలాంటి గాయాలు, ప్రాణహాని జరగలేదు.
విజయవాడ : గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలినాని కాన్వాయికి ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం కొడాలి నాని కుటుంబ సమేతంగా వచ్చారు. దర్శనానంతరం తిరిగి వెళ్లే సమయంలో వినాయకుడి గుడి దగ్గర ఉన్న సిమెంట్ బారికేడ్ ను కొడాలి నాని కారు ఢీ కొట్టింది. అయితే ఇది స్వల్ప ప్రమాదమే అని తెలుస్తోంది.
ప్రమాద సమయంలో ఆ కారులో కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఉన్నారు. అయితే డ్రైవర్ అప్రమత్తతతోనే ఇది చిన్న ప్రమాదంతో ముగిసిపోయిందని…పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత కొడాలి నాని అదే కారులో వెళ్లారని అంటున్నారు.
undefined
బాపట్లలో భారీ అగ్నిప్రమాదం... ఏకంగా రూ.400 కోట్ల సొత్తు కాలిబూడిద
ప్రమాదం విషయం తెలియడంతో విజయవాడకు చెందిన వైసిపి నేతలు, కొడాలి నాని వీరాభిమానులు ఫోన్ చేసి వివరాలు అడిగి, పరామర్శిస్తున్నారు. గురువారం నాడు కొడాలినాని ఇంట్లో ఆయన మేనకోడలి పెళ్లి వేడుక జరిగింది. ఈ శుభకార్యం కోసం బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.కంకిపాడు అయాన కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కూడా హాజరయ్యారు. బంధువుల మధ్య ఎంతో సంతోషంగా గడిపిన మరుసటి రోజూ ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించింది. కానీ, చిన్న ప్రమాదంతో పోవడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.