జగన్ పోనీలే అంటున్నారు.. తలచుకుంటే ఇంటికొచ్చి కొడతాం : బాబు, లోకేశ్‌లకు కొడాలి నాని వార్నింగ్

By Siva KodatiFirst Published Sep 8, 2022, 9:03 PM IST
Highlights

వైఎస్ భారతి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే చంద్రబాబు కుటుంబ బతుకు బయటపెడతానని హెచ్చరించారు మాజీ మంత్రి కొడాలి నాని. తాము తలచుకుంటే తండ్రి కొడుకులిద్దరిని ఇంటికి వెళ్లి కొడతామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు నారా లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గురువారం గుడివాడ 34వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు కొడాలి నాని. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ కుటుంబ సభ్యుల గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే, చంద్రబాబు కుటుంబ బతుకు బయటపెడతానని హెచ్చరించారు. 

2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తో పాటుగా ఓవరాక్షన్ చేస్తున్న వారందరినీ రాష్ట్రం నుండి తరిమికొడతామని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతమ్మ గురించి మరోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లోకేష్‌ను హెచ్చరించారు. పాముల్లాంటి చంద్రబాబు , లోకేష్ గురించి జగన్‌కు ముందే చెప్పానని... ఆయన పోనీలే అనబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఉత్తర కుమార ప్రగల్బాలు ఆపకపోతే, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాడని ఆయన హెచ్చరించారు. తనను ఏదో చేద్దామనుకొని నలుగురు ఆడవాళ్ళను తన ఇంటిపైకి పంపారని కొడాలి నాని దుయ్యబట్టారు. తాము తలచుకుంటే తండ్రి కొడుకులిద్దరిని ఇంటికి వెళ్లి కొడతామని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALso Read:పైకి పాల వ్యాపారం.. లోపల లిక్కర్ బిజినెస్ : చంద్రబాబు ఫ్యామిలీపై పోతుల సునీత ఆరోపణలు

అంతకుముందు మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్‌ను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. కొడుకును కట్టడి చేయకపోతే సభ్యతగా వుండదని.. సమాజం కూడా హర్షించదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు ట్విట్టర్ తేరగా దొరికిందని.. తద్వారా ఇష్టం వచ్చినట్లు ట్వీట్లు చేస్తున్నారని ఆయన సెటైర్లు వేశారు. 

లోకేశ్‌కు అసలు మంత్రి పదవి ఎలా వచ్చింది.. ఆయన కోసం ఐదుగురు మంత్రులను తొలగించారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగిందని ఆయన ఆరోపించారు. 600 హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎల్లో మీడియా ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబు కాదా .. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టారని మాజీ మంత్రి ఆరోపించారు. ఆర్ధిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని పేర్ని నాని స్పష్టం చేశారు. 

click me!