ముఖంపై సాంబారు పోసి , ఆపై గొంతు పిసికి : నంద్యాల అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్‌పై హత్యాయత్నం

Siva Kodati |  
Published : Sep 08, 2022, 07:08 PM ISTUpdated : Sep 08, 2022, 07:14 PM IST
ముఖంపై సాంబారు పోసి , ఆపై గొంతు పిసికి : నంద్యాల అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్‌పై హత్యాయత్నం

సారాంశం

నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ వెంకటదాస్‌పై హత్యాయత్నం జరిగింది . అయితే దుండగుల నుంచి తప్పించుకున్నారు వెంకటదాస్.

నంద్యాల మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ వెంకటదాస్‌పై హత్యాయత్నం జరిగింది. ముఖంపై సాంబారు పోసి గొంతునొక్కి హత్య చేసేందుకు దుండగులు యత్నించారు. అయితే దుండగుల నుంచి తప్పించుకున్నారు వెంకటదాస్. ఇటీవల నంద్యాల మున్సిపాలిటీలో పలువురి సస్పెన్షన్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సస్పెన్షన్ వ్యవహారమే హత్యాయత్నానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కొద్దిరోజుల క్రితం నంద్యాల మున్సిపాలిటీలో కమీషనర్ వర్సెస్ అసిస్టెంట్ కమీషనర్ అన్నట్లుగా పరిస్ధితి నెలకొంది. సచివాలయ సిబ్బంది కేటాయింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో క్లర్క్, మేనేజర్‌కు మెమోలు జారీ చేశారు అధికారులు. అలాగే నిర్లక్ష్యం వహించారని అసిస్టెంట్ కమీషనర్ దాస్‌కు కూడా మెమో జారీ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కమీషనర్‌పై స్థిరపడ్డారు. కమీషనర్ ఎదుటే మెమో కాపీలను చింపేశారు అసిస్టెంట్ కమీషనర్. కమీషనర్‌గా పనిచేశానని.. రూల్స్ తనకు తెలుసునంటూ వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు అసిస్టెంట్ కమీషనర్. అధికారుల మధ్య విభేదాలతో సిబ్బందిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు