మాధవ్ వీడియో వ్యవహారం.. లింగ నిర్ధారణలో నిష్ణాతులు, ఏది ఎవరిదో కూడా తేల్చుతారా : టీడీపీపై కొడాలి నాని

By Siva KodatiFirst Published Aug 11, 2022, 6:58 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ అని పోలీసులు చెబుతున్నా.. టీడీపీ రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ (gorantla madhav) వీడియో వ్యవహారంపై మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్ వీడియో అని పోలీసులు చెప్పినా టీడీపీ (tdp) రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు వృద్ధులంతా కలిసొచ్చిన వైసీపీని ఏం చేయలేరని నాని స్పష్టం చేశారు. లింగ పరిశోధనలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు.. రాష్ట్రంలో ఏది ఎవరిదో కూడా తేల్చి ఐడీ కార్డులు ముద్రిస్తారా అంటూ కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాడిస్టుల మాదిరి సిగ్గు శరం లేకుండా కేసులు పెట్టాలంటున్న ... టీడీపీ ఎవరిపై పెట్టాలో కూడా చెప్పాలని కొడాలి నాని ధ్వజమెత్తారు. 

అంతకుముందు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని , ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని స్పష్టం చేశారు. ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 

Also Read:గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో ఒరిజినల్ కాదు: అనంతపురం ఎస్పీ ఫకీరప్ఫ

తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యూకేకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ నెంబర్ ఉపయోగిస్తుంది ఎవరనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. యూకే నుండి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని ...ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారనే విషయమై వివరాలు ఇవ్వాలని వొడాఫోన్ ను కూడా సమాచారం కోరినట్టుగా ఫకీరప్ప చెప్పారు. 

ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుతుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని వీడియో ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారనే సందేహలున్నాయని ఫకీరప్ప పేర్కొన్నారు. 

click me!