ముందస్తు ప్రసక్తే లేదు.. 2024లోనూ 151 సీట్లు తగ్గకూడదన్నారు: జగన్‌తో భేటీ తర్వాత కొడాలి నాని

Siva Kodati |  
Published : Apr 27, 2022, 06:04 PM IST
ముందస్తు ప్రసక్తే లేదు.. 2024లోనూ 151 సీట్లు తగ్గకూడదన్నారు: జగన్‌తో భేటీ తర్వాత కొడాలి నాని

సారాంశం

2024 ఎన్నికలను  దృష్టిలో వుంచుకుని ఈ రోజు సీఎం జగన్అధ్యక్షతన తాడేపల్లిలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పార్టీల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి కొడాలి నాని మీడియాకు వివరించారు. 

2024 అసెంబ్లీ ఎన్నికల్లో (2024 ap election) 151 సీట్లకు అదనంగా గెలవాలి కానీ.. తక్కువ రావడానికి వీల్లేదని జగన్ దిశానిర్దేశం  చెప్పినట్లు చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని. 2024 ఎన్నికలను దృష్టిలో వుంచుకుని ఈ రోజు సీఎం జగన్  (ys jagan) అధ్యక్షతన తాడేపల్లిలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. మే 10 నుంచి ఎమ్మెల్యేలను నియోజకవర్గాల్లో పర్యటించాల్సిందిగా ఆదించారని చెప్పారు. 

అలాగే ప్రతి నెలా పది సచివాలయాలు వున్న ఏరియాల్లో ఇంటింటికి వెళ్లాలని సూచించారని కొడాలి నాని వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు.. కుటుంబాలు పొందిన లబ్దిని వివరించాలని మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో ఆర్డినేటర్లను ఆదేశించినట్లు నాని చెప్పారు. 94 శాతం మేనిఫెస్టోను అమలు చేశామన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సీఎం సూచించినట్లు నాని తెలిపారు. మంత్రులు, జిల్లా నేతలతో సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని జగన్ చెప్పారని పేర్కొన్నారు. 

మంత్రులు, పార్టీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు అంతా సమానమేనని నాని అన్నారు. సచివాలయంలో గ్రామ సమస్యల కోసం  పుస్తకం ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారని నాని పేర్కొన్నారు. ప్రజలు ఈ సమస్యలను పుస్తకంలో రాయొచ్చని తెలిపారు. ఎట్టి పరిస్ధితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని కొడాలి నాని వెల్లడించారు. సీఎం సర్వేలు చేయిస్తున్నారని.. జూలై 8న వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు. 65 శాతం సీఎం గ్రాఫ్ బాగుందని సర్వేలు చెబుతున్నాయని కొడాలి నాని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్