
చికోటి ప్రవీణ్ వ్యవహారంపై మాజీ మంత్రి , వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivasa reddy) స్పందించారు. క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చిచెప్పారు. తాను ఎప్పుడైనా క్యాసినోకు వెళ్తానని.. పేకాట ఆడతానని బాలినేని తెలిపారు. అయితే చికోటి ప్రవీణ్‌తో కానీ.. హవాలా వ్యవహరాలతో కానీ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఉన్న విషయాలు ఒప్పుకుంటానని.. డ్రామాలు చేయడం తనకు రాదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనకు ప్రవీణ్‌తో సంబంధాలు వున్నాయని భావిస్తే ఎవరైనా విచారణ చేయొచ్చని బాలినేని స్పష్టం చేశారు. కావాలని టీవీలు, పేపర్‌లలో తన పేరు బయటకు తీసుకొస్తే మంచి పద్ధతి కాదన్నారు.
మరోవైపు.. చికోటి ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. దాదాపు 20 గంటల పాటు అతని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రవీణ్ తో పాటు Madhava Reddy నివాసంలో కూడా Enforcement Directorate, అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డిలను విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆగష్టు 1వ తేదీన విచారణకు రావాలని ఈడీ అధికారులు ఆదేశించారు.చీకోటి ప్రవీణ్ కు చెందిన ల్యాప్ టాప్ ను మొబైల్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
Also Read:క్యాసినోలకు సినీతారల ప్రచారం.. యాక్టర్లకు ఈడీ నోటీసులు ?
వాట్సాప్ లో ప్రముఖులతో చాటింగ్ కు సంబంధించిన సమాచాారాన్ని కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. సినీ తారలతో పాటు వీవీఐపీలు, రాజకీయ నేతలతో ప్రవీణ్ చాటింగ్ లపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. హావాలా ద్వారా డబ్బులను ప్రవీణ్ తరలించినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ లాప్ టాప్ లోని అనుమానాస్పద లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కు చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు గుర్తించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో నామ మాత్రపు డబ్బులు ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు కేసినో ఆడేందుకు వెళ్లే వారి నుండి నగదు రూపంలోనే ప్రవీణ్ డబ్బులు తీసుకొన్నాడని సమాచారం. మరో వైపు కేసినో వ్యాపారానికి సంబంధించి సినీ తారలతో కూడా ప్రవీణ్ ప్రచారం చేయించాడు. సినీతారలతో ప్రచారానికి సంబంధించిన ప్రోమోలను కూడా వాట్సాప్ ద్వారా ప్రవీణ్ షేర్ చేశారని ఈడీ అధికారులు గుర్తించారని తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.