కాపుల ఓట్లను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మే యత్నం: పవన్ కళ్యాణ్ పై జగన్ ఫైర్

Published : Jul 29, 2022, 01:15 PM ISTUpdated : Jul 29, 2022, 01:34 PM IST
 కాపుల ఓట్లను చంద్రబాబుకు హోల్ సేల్ గా అమ్మే యత్నం: పవన్ కళ్యాణ్ పై జగన్ ఫైర్

సారాంశం

కాపుల ఓట్లను మూట గట్టి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్  హోల్ సేల్ గా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. గొల్లప్రోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన  సభలో జగన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు.   

పిఠాపురం:  కాపుల ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు దత్తపుత్రుడు ప్రయత్నం చేస్తున్నాడని ఏపీ సీఎం YS Jagan  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలుచేశారు.శుక్రవారం నాడు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని గొల్లప్రోలు Kapu Nestham పథకం కింద నిధులను విడుదల చేసిన తర్వాత నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  రాజకీయాలు దిగజారి కన్పిస్తున్నాయన్నారు. Kapu  ఓట్లను కొంత మేరకైనా మూటగట్టి వాటిని మరోసారి Chandrababu Naidu కు హోల్ సేల్ గా అమ్మేసేందుకు ప్రయత్నిస్తున్నారని Pawan Kalyan పై విమర్శలు చేశారు. దోచుకో, పంచుకో, తినుకో  అనే దత్తపుత్రుడి రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయత్నించలేదని వైసీపీ నేతలు ప్రశ్నించారు. ఈ విషయమై రాష్ట్రంలో  రాజకీయ పార్టీల మధ్య పొత్తుల విషయమై చర్చ సాగింది.  పవన్ కళ్యాణ్ తన ముందు ఉన్న మూడు ఆఫ్షన్లను కూడా వివరించారు. జనసేన ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీతో కలిసి పోటీ చేయడం, బీజేపీ,, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం తన ముందున్న ఆఫ్షన్లు అని ఆయన ప్రకటించారు. అయితే  ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయమై స్పందించలేదు. కానీ అధికార వైసీపీపై మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు.

also read:డీబీటీ కావాలా, డీపీటీ కావాలో తేల్చుకోవాలి: వైఎస్ఆర్ కాపు నేస్తం నిధుల విడుదల చేసిన జగన్

ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. 2014 తరహాలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కూటమిగా ఉంటాయా, టీడీపీ,జనసేనలు కలిసి పోటీ చేస్తాయా, బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయమై ఇప్పటికిప్పుడు మాత్రం స్పష్టత లేదు. మరో వైపు విపక్షపార్టీలన్నీ కలిసి పోటీ చేస్తాయా అనే విషయమై తేలాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేక  ఓటు చీలకుండా ఉండాలంటే విపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అయితే ఏపీ అసెంబ్లీకి ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అధికార పార్టీ మాత్రం నిర్ణీత సమయం ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని చెబుతుంది. 

ఎన్నికల సమయంలోనే పొత్తుల విషయమై రాజకీయ పార్టీల మధ్య పొత్తుల విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీతో సీపీఐ మైత్రి కొనసాగుతుంది. సీపీఎం మాత్రం స్వతంత్రంగా పోరాటాలు చేస్తుంది. బీజేపీ, జనసేనల మధ్య పొత్తుంది. కానీ  రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు చేయడం అరుదుగా ఉంది.  బద్వేల్ ఉప ఎన్నికకు జనసేన దూరమని ప్రకటించింది. కానీ ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. మరో వైపు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది.,  వచ్చే ఎన్నికల్లో తమ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ నేతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం