ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. జగన్ పై అయ్యన్న ఫైర్

By telugu news teamFirst Published Jan 9, 2021, 12:36 PM IST
Highlights

నిమ్మగడ్డ టిడిపి వ్యక్తి అంటూ గతంలో సీఎం జగన్ నోరుపారేసుకున్నాడని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఒక ఫేస్ సీఎం అంటూ మండిపడ్డారు. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ఇటీవల ఈ ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అయితే.. ఆ ఎన్నికలు నిర్వహించడాన్ని జగన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. వాటిని ఆపేందుకు సుప్రీం కోర్టు మెట్లు అయినా ఎక్కేందుకు రెడీగా ఉంది.  కాగా..ఈ విషయంపై తాజాగా.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. 

కరోనా విజృంభిస్తున్న సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తే నిమ్మగడ్డ టిడిపి వ్యక్తి అంటూ గతంలో సీఎం జగన్ నోరుపారేసుకున్నాడని అయ్యన్న పాత్రుడు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ఒక ఫేస్ సీఎం అంటూ మండిపడ్డారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గింది అందుకే పాఠశాలలు తెరిచాం అని చెబుతున్న ప్రభుత్వమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యగానే నిమ్మగడ్డ టిడిపి మనిషి అంటూ మరోసారి ఫేక్ ప్రచారం మొదలెట్టిందంటూ విమర్శించారు. 

.అసలు విషయం ఏంటి అంటే చెత్త పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అనే రహస్య నివేదికలు ప్రశాంత్ కిషోర్ అందజేసాడని..అందుకే పులివెందుల పిల్లికి లోకల్ ఎన్నికలు అనగానే వణుకు పుట్టి అర్థంపర్థం లేని ఆరోపణలు చేసి పారిపోతున్నాడని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

click me!