స్థానిక సంస్థల ఎన్నికలకు బిజెపి సిద్ధమే : సోము వీర్రాజు

By AN TeluguFirst Published Jan 9, 2021, 11:40 AM IST
Highlights

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమేనని బిజెపి స్పష్టం చేసింది. ఈ మేరకు బీజేపీ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. ఎన్నికల కమిషనర్ గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో అధికార పార్టీ దాదాపు 25 శాతం దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుందన్నారు.

అదే సమయంలో పాత  నోటిఫికేషన్ రద్దు చేయాలని గతంలో సైతం ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఇదే అంశం అఖిలపక్ష సమావేశంలో నిమ్మగడ్డకు చెప్పామని సోము వీర్రాజు అన్నారు. .

నేడు ఎన్నికల కమిషనర్ పంచాయతీ నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసి పాత నోటిఫికేషన్ రద్దు చేయలేదని, పాత నోటిఫికేషన్ లను రద్దు చేయాలని  బిజెపి ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తోందని అన్నారు.  

నాలుగు దశలుగా స్థానికలు ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నాలుగు దశల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. 

స్థానిక సంస్థల పోలింగ్ ఫిబ్రవరి 17వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన తరుణంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియోగించడం, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. 
 
click me!