అలా అయితే సభలో నేను ఉండను: మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్

Published : Jul 16, 2019, 12:01 PM IST
అలా అయితే సభలో నేను ఉండను: మంత్రి అచ్చెన్నాయుడు సీరియస్

సారాంశం

నీయమ్మ, బయటకు రా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు.  .  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. మాజీమంత్రి అచ్చెన్నాయుడుపై మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి దారి తీశాయి. నాని వ్యాఖ్యలపై మాజీమంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

నాని వ్యాఖ్యలకు తాను బాధపడుతున్నానని తెలిపారు. సభలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ మూడు రోజులుగా బాధపడుతున్నట్లు తెలిపారు. నీయమ్మ, బయటకు రా చూసుకుందాం, తేల్చుకుందాం అంటూ వ్యాఖ్యలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఏంటి ఈ వ్యాఖ్యలు అంటూ ఇది అసెంబ్లీ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారని ప్రశ్నించారు. తాను ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, వల్గర్ గా అసలు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. తాను ఏదైనా తప్పుగా మాట్లాడితే సభలో ఇక ఉండనంటూ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఈయమ్మ ఏంట్రా ఈయనను గెలిపించామా..: అచ్చెన్నాయుడుపై మంత్రి పేర్నినాని వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్